సీఎం జగన్ రెడ్డి ఆత్మలతో కాకుండా అంతరాత్మతో మాట్లాడి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. జగన్ అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం కాసేపు ఆపి.. మంత్రులు, అధికారులతో మాట్లాడితే కొంతవరకైనా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
నిరుద్యోగులను నిలువునా ముంచేసిన జాబ్ లెస్ క్యాలెండర్ని రద్దు చేయాలని కోరారు. పాదయాత్రలో హామీ ఇచ్చినట్లు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.