ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించిన నారా లోకేశ్ - నారా లోకేశ్ మచిలీపట్నంలో పర్యటన

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు సంస్మరణ సభకు నారాలోకేశ్ హాజరయ్యారు. పార్టీ అభివృద్ధికి నడకుదిటి చేసిన సేవలను కొనియాడారు.

nara lokesh machilipatnam tour, lokesh condolences ex minister kollu ravindra
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించిన నారా లోకేశ్, నారా లోకేశ్ మచిలీపట్నం పర్యటన

By

Published : Apr 16, 2021, 7:17 AM IST

మాజీ మంత్రి నడకుదిటి సంస్మరణ సభకు హాజరైన నారా లోకేశ్

తెదేపా అభివృద్ధికి మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు చేసిన కృషి ఆదర్శనీయమని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన నరసింహారావు సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి.. నడకుదిటి అల్లుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించారు.

ఇదీ చదవండి:భయంతో టీకాలకు దూరంగా 18వేల ఉద్యోగులు

రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన నరసింహారావు.. అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొన్నారని లోకేశ్ గుర్తుచేశారు. స్థానిక, పొరుగు జిల్లాల తెదేపా నేతలు, వివిధ రాజకీయపక్షాల ప్రముఖులు.. సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని నడకుదిటి సేవలను కొనియాడారు.

ఇదీ చదవండి:'నిరుద్యోగుల కోసం షర్మిల రాష్ట్రంలోనూ దీక్ష చేయాలి'

ABOUT THE AUTHOR

...view details