ప్రతిపక్షనేత(చంద్రబాబు) ఇంటిపైకి ఎమ్మెల్యేని, బులుగు గూండాలని పంపిన సీఎం జగన్ రెడ్డి తాడేపల్లి భవనంలో ఎంతలా వణికిపోతున్నారో అర్థమవుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ఇంతకంటే దిగజారడని అనుకున్న ప్రతిసారీ.. అధఃపాతాళంలో కూరుకుపోతున్నారని విమర్శించారు. సీఎంను ఉద్దేశించి లోకేశ్ పలు వ్యాఖ్యలు చేశారు.
LOKESH: మీవీ గాలి హామీలు.. మీ ముద్దులు పిడిగుద్దులు: నారా లోకేశ్ - విజవాడ
20:04 September 17
ఇప్పుడు దాడి చేసిన వారికి వడ్డీతో సహా వడ్డిస్తాం
"మీవీ(సీఎం జగన్) గాలి హామీలు అని తేలిపోయాయి. మీ ముద్దులు పిడిగుద్దుల్లా పడుతున్నాయి. మీది అంతా నాటకమనీ జనానికి తెలిసిపోయింది. జనం తిరగబడే రోజు దగ్గరపడింది. ఉలిక్కిపడి ప్రతిపక్షంపైకి వాళ్లనీ, వీళ్లనీ పంపడం ఎందుకు. మీరే ఓ సారి వచ్చిపోకూడదు. మా పెద్దాయన నీలాంటి క్రూర, నేరస్వభావం ఉన్నోడు కాదు. నువ్వు ముంచేయాలని నిత్యం తపించే కరకట్ట పక్క ఇంట్లో టీ, స్నాక్స్ పెట్టి, బొత్తిగా నీకు తెలియని అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం" -నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
కొత్త పరిశ్రమలు ఎలా తీసుకురావాలి.. ఉపాధి అవకాశాలు ఎలా పెంచాలో చక్కగా వివరిస్తామని అన్నారు. కాదూ-కూడదు ఇలాగే బ్లేడ్ బ్యాచ్‌లను వేసుకొచ్చేస్తానంటే, ఒక్కొక్కరికి వడ్డీతో సహా వడ్డిస్తామని సీఎం జగన్ను లోకేశ్ హెచ్చరించారు.
ఇవీ చదవండి: