ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి దాతృత్వం చూపారు. కృష్ణా జిల్లా చల్లపల్లి ఎన్టీఆర్ హైస్కూల్లో డే - స్కాలర్స్గా 6 నుంచి 9 తరగతి చదివే స్థానిక విద్యార్ధులకు ఉచిత విద్య అందివ్వాలని నిర్ణయించారు. తరగతికి పది మంది చొప్పున 40 మందిని ఎంపిక చేసి.. వారికి ఉచిత విద్యను అందించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.
అభ్యర్థుల సంఖ్య, నిర్ణయించిన సీట్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటే సెప్టెంబర్ 25వ తేదీన ప్రతిభ పరీక్ష పెట్టనున్నట్లు వెల్లడించారు. తద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ఉచిత విద్యకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్ధినీ విద్యార్ధులు.. చల్లపల్లి ఎన్టీఆర్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ను సంప్రదించి సెప్టెంబర్ 22వ తేదీలోపు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.