డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని... కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. అంబేడ్కర్ 64వ వర్ధంతి సందర్భంగా వైకాపా కార్యాలయంలో మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, పేరుపొందిన మహామేధావి అంబేడ్కర్ భారతదేశానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు.
ఆయన ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడమే మనం ఇచ్చే ఘన నివాళులని ఎమ్మెల్యే తెలిపారు. సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందిస్తే దాన్ని అమలు చేసే ముఖ్యమంత్రిగా జగన్ మంచి పేరు సాధించారన్నారు.