ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నందిగామ ఎమ్మెల్యే​ జగన్​మోహన్ రావుకు కరోనా

నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్​మోహన్ రావుకు కరోనా పాటిజివ్​ నిర్ధరణ అయింది. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కొవిడ్​ పరీక్షలు చేయించుకుని, హోం క్వారంటైన్​లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

By

Published : Sep 21, 2020, 3:44 PM IST

Published : Sep 21, 2020, 3:44 PM IST

nandigama mla jagan mohan rao affected by covid -19
నందిగామ ఎమ్మెల్యే​ జగన్ మోహన్ రావుకు కరోనా

తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్​మోహన్ రావు తెలిపారు. రెండు రోజుల నుంచి నీరసంగా ఉండటం వల్ల పరీక్షలు చేయించుకోగా..పాజిటివ్​గా నిర్ధరణ అయిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకుని, హోం క్వారంటైన్​లో ఉండాలని సూచించారు.

ప్రజలందరి ఆశీస్సులతో త్వరలోనే కోలుకొని ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. చికిత్స తీసుకుంటున్నందున 14 రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరూ ఫోన్ చేయడం, కలవడానికి ప్రయత్నించవద్దని కోరారు.

ఇదీ చూడండి:రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ అక్టోబర్ 5కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details