ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దగ్గు, జలుబు, జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకండి' - nandigama mla corona awareness programme

కంచికచర్ల పరిధిలోని గ్రామాల్లో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్​రావు ద్విచక్రవాహనంపై పర్యటించారు. లాక్​డౌన్​లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. కరోనా వైరస్​ అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేశారు. సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు.

nandigama mla given councelling to constitutency people on corona awareness
ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్న నందిగామ ఎమ్మెల్యే

By

Published : Apr 23, 2020, 1:14 PM IST

కరోనా వైరస్​పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మండలంలోని కునికినపాడు, మున్నలూరు, మొగులూరు గ్రామాల్లో ద్విచక్రవాహనంపై పర్యటించారు. లాక్​డౌన్​ కారణంగా గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. కరోనా​ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతోనే వైరస్​ను అరికట్టగలమని ఎమ్మెల్యే తెలియజేశారు.

గ్రామాల్లోని ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు వహించాలన్నారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వస్తే వెంటనే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి గ్రామాల్లోకి వచ్చిన వారు వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాల పంపిణీపై ప్రజల నుంచి సమాచారం తెలుసుకున్నారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details