కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో ఈ నెల 5వ తేదీన షేక్ బాజీ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భర్త పెట్టే హింస తట్టుకోలేక భార్యే అతన్ని చంపిందని తేల్చారు.
MURDER: కాళ్లు చేతులు కట్టి.. చున్నీతో మెడను బిగించి.. - భర్తను చంపిన భార్య
జుజ్జూరులో ఈ నెల 5వ తేదీన షేక్ బాజీ అనే అనుమానాస్పదంగా మరణించాడు. భార్య ఖాసీంబీనే అతన్ని హత్య చేసిందని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
ఈనెల 5న బాజీ మృతిచెందాడు. అయితే తన అన్నది హత్యేనని మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో షేక్ బాజీని హత్య చేసింది అతని భార్య ఖాసీంబీ అని పోలీసులు తేల్చారు.
ఈ నెల 5వ తేదీ రాత్రి పడుకొని ఉన్న భర్త కాళ్లు చేతులు కట్టి.. చున్నీ మెడకు బిగించి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. తన భర్త తాగి వచ్చి తనను, పిల్లలను హింసించడం తట్టుకోలేక భర్తను చంపినట్లు నిందితురాలు అంగీకరించిందని తెలిపారు. ఈ రోజు ఉదయం నిందితురాలిని అరెస్టు చేసినట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి:MURDERS: కుమార్తెను చంపారని..రెండేళ్ల తర్వాత తీర్చుకున్న పగ