కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో దుండగుల దాడి చేసి ఆలయంలో ఉన్న నంది విగ్రహం ధ్వంసం చేశారు. ఆలయ ప్రధాన గేటును తెరిచిన దుండగులు లోపలికి వెళ్లారు.
శివలింగానికి ఎదురుగా ఉన్న రాతి నంది విగ్రహం రెండు చెవులను ధ్వంసం చేశారు. ఆలయంలో ఉన్న శివలింగం, అయ్యప్ప స్వామి, ఇతర విగ్రహాల జోలికి వెళ్లలేదు. గుర్తుతెలియని దుండగులు కావాలనే ఆలయంలోని నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు.