ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావయ్యను తిడితే ఊరుకునేది లేదు: నందమూరి చైతన్యకృష్ణ - nandhamuri family fires on kodali nani

చంద్రబాబుపై అసభ్యకరంగా మాట్లాడితే సహించేది లేదని నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హెచ్చరించారు. మంత్రి కొడాలినాని, వల్లభనేని వంశీ ఇకపై మంచిగా మాట్లాడాలని సూచించారు.

కొడాలి నాని, వంశీపై నందమూరి చైతన్యకృష్ణ

By

Published : Nov 19, 2019, 1:17 PM IST

కొడాలి నాని, వంశీపై నందమూరి చైతన్యకృష్ణ

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను నందమూరి కుటుంబ సభ్యులు ఖండించారు. పార్టీపరంగా విమర్శలు చేసుకుంటే పర్వాలేదని... అసభ్యకరంగా దూషిస్తే సహించేది లేదని నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు దయతోనే వారిద్దరూ ఇంతవారయ్యారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details