నల్సార్ విశ్వవిద్యాలయం గత సెప్టెంబర్‌లో ఏపీ పోలీస్ సీఐడీతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నలుగురు విద్యార్థుల బృందం రెండు నెలల ఇంటర్న్‌షిప్ కోసం రాష్ట్రానికి వచ్చింది. వారు గురువారం డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను కలిశారు. వీరికి ఏపీ పోలీస్ మాన్యువల్‌లోని ప్రోసీజర్లు, కోర్టుల్లో ప్రత్యేక కేసులు, పూర్వపు జడ్జిమెంట్ల అనలైజింగ్, వివిధ కేసుల్లో ఎస్వోపీస్, చట్టాల అమలు పనితీరు గురించి సీఐడీ అవగాహన కల్పించనుంది.
డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసిన నల్సార్ విద్యార్థుల బృందం - gowtham sawang latest news
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థుల బృందం డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసింది. ఈ విద్యార్థులు రెండు నెలల ఇంటర్నషిప్ కోసం రాష్ట్రానికి వచ్చారు.
![డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసిన నల్సార్ విద్యార్థుల బృందం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన నల్సార్ విద్యార్థుల బృందం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9441170-280-9441170-1604576639729.jpg)
డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన నల్సార్ విద్యార్థుల బృందం
TAGGED:
gowtham sawang latest news