ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేశాడని చంద్రబాబుకు నోటీసులిస్తారా..?'

అసైన్డ్ భూములున్న దళితులకు న్యాయంచేయడానికే చంద్రబాబు ప్రభుత్వం.. జీవోనెం-42 తీసుకొచ్చిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. జీవో తీసుకొచ్చినప్పటి నుంచీ, నేటివరకు ఏ.. ఎస్సీ తనకు అన్యాయం జరిగిందని చెప్పలేదని నక్కా ఆనందబాబు తెలిపారు. జీవోనెం-41 తప్పయితే..వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనెం-72 కూడా తప్పేనని నక్కా ఆనందబాబు అన్నారు.

nakka anandh babu
nakka anandh babu

By

Published : Mar 17, 2021, 2:51 PM IST

చంద్రబాబుకు సీఐడీ నోటీసులపై మాట్లాడుతున్న నక్కా ఆనంద బాబు

తెదేపా అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా అసహ్యించుకుంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. పట్టాభూములున్న వారితో సమానంగా అసైన్డ్ భూములున్న దళితులకు న్యాయం చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం.. జీవో నెం. 42 తీసుకొచ్చిందని నక్కా ఆనంద బాబు అన్నారు. జీవో తీసుకొచ్చినప్పటి నుంచీ, నేటివరకు ఏ.. ఎస్సీ తనకు అన్యాయం జరిగిందని చెప్పలేదని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. బాధితులు కాకుండా.. ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేశాడని చంద్రబాబుకు నోటీసులిస్తారా అని ప్రశ్నించారు.

జీవో నెం. 41 తప్పయితే..వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 72 కూడా తప్పేనని నక్కా ఆనందబాబు అన్నారు. ప్రజలను, తెదేపా శ్రేణులను అభద్రతా భావానికి గురి చేయాలనే చంద్రబాబుకు నోటీసులిచ్చారని నక్కా ఆరోపించారు.

ఇదీ చదవండి: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు.. నెల్లూరులో సోదాలు

ABOUT THE AUTHOR

...view details