ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇలాంటివే తెలంగాణలోనూ జరిగాయ్ : నక్కా ఆనంద్​బాబు - నేత నక్కా ఆనంద్‌బాబు తాజా వార్తలు

అచ్చెన్నాయుడు అరెస్ట్​పై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. కక్ష సాధింపుతో తెదేపా నేతలపై అభియోగాలు మోపుతున్నారని నక్కా ఆనంద్​బాబు ఆరోపించారు. ఈఎస్‌ఐలో ఇలాంటివే తెలంగాణలోనూ జరిగాయన్నారు.

nakka anandbabu
nakka anandbabu

By

Published : Jun 13, 2020, 10:29 PM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్​ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలు ఆందోళనలు చేస్తున్నారు. అచ్చెన్నాయుడు కేసు చట్టవిరుద్ధమని ఆ పార్టీ నేత నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. ఈఎస్‌ఐ కార్యకలాపాలు కేంద్రానికి సంబంధించినవని తెలిపారు. ఈఎస్‌ఐలో ఇలాంటివే తెలంగాణలోనూ జరిగాయని ఆయన ఆరోపించారు.

న్యాయస్థానంలో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడుపై కక్షతోనే అభియోగాలు మోపారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇదీ చదవండి:పరామర్శించడానికి వెళితే అనుమతి ఇవ్వలేదు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details