ప్రభుత్వ పరీక్షల్లో కరోనా నెగెటివ్ వస్తుంటే.. ప్రైవేట్ ల్యాబుల్లో పాజిటివ్ వస్తోందని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ నాగుల్ మీరా ఆరోపించారు. ప్రభుత్వం చెప్పే కేసుల సంఖ్య కంటే పదిరెట్లు ఎక్కువగా కరోనా కేసులు వస్తున్నాయని నాగుల్ మీరా పేర్కొన్నారు. వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని పూర్తి వివరాలతో ఒక్క హెల్త్ బులెటిన్ కూడా ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రే మాస్కు పెట్టుకోకుంటే... ప్రజలెలా పెట్టుకుంటారని నాగుల్ మీరా ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
'కరోనా కేసుల సంఖ్యను తక్కువ చేసి చెప్తున్నారు' - ఏపీలో కరోనా కేసులు
వైకాపా ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య తక్కువ చేసి చూపిస్తోందని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ నాగుల్ మీరా ఆరోపించారు. వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని పూర్తి వివరాలతో ఒక్క హెల్త్ బులెటిన్ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
కరోనా కేసులపై ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ నాగుల్ మీరా
Last Updated : Jul 10, 2020, 3:58 PM IST