కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవిలో నాగుల చవితిని ఘనంగా నిర్వహిస్తున్నారు. నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
మెుక్కులు చెల్లించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా క్యూలైన్లు, మంచినీరు, పార్కింగ్, ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ జీవీడియన్ లీలా కుమార్ తెలిపారు.