ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి.. 14 అంశాల్లో సహకారం అందించండి' - crude oil in krishna

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్ల వారి పాలెం ప్రజలు.. ఓఎన్జీసీ సంస్థ ఉన్నతాధికారులను కలిశారు. తమ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని వినతి పత్రం ఇచ్చారు.

krishna distrct
మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి

By

Published : Jun 29, 2020, 7:31 PM IST

కృష్ణా జిల్లా నాగాయలంక శివారు వక్కపట్ల వారిపాలెం గ్రామంలో ఓఎన్జీసీ సంస్థ.. 2018 నుంచి క్రూడ్ ఆయిల్, గ్యాస్ ను వెలికితీస్తోంది. ఈ నేపథ్యంలో.. తమ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వక్కపట్ల వారి పాలెం ప్రజలు సంస్థ ఉన్నతాధికారులను కలిశారు.

మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అంతర్గత రహదారులు, గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయం, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి సహకారం, నిరుద్యోగులకు ఉపాధి వంటి 14 అంశాలతో కూడిన వినతి పత్రాన్నిఅందించారు.

ABOUT THE AUTHOR

...view details