ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించిన పంచహారతులను వీక్షించి తరించారు. అనంతరం నిర్వహించిన నగరోత్సవంలో సైతం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్త బృందాల కోలాటాల నడుమ ఉత్సవం కన్నుల పండువగా సాగింది. ఉత్సవాల్లో నేడు దుర్గా దేవిగా అమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇంద్రకీలాద్రిపై నగరోత్సవం... అంబరాన్నంటిన సంబరం - ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ అలంకరాల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శనివారం మూలా నక్షత్రం సందర్భంగా నిర్వహించిన నగరోత్సవం కన్నుల పండువగా సాగింది.
నగరోత్సవ వైభవం