ఇదీ చూడండి:
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో వైభవంగా నగరోత్సవం - nagarostssavam in Vijayawada Kanaka Durgamma temple
పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నగరోత్సవం జరిగింది. గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను మల్లికార్జున మహామండపం నుంచి హంసవాహనంపై ఊరేగించారు. అనంతరం కనకదుర్గానగర్, రథం సెంటర్, కనకదుర్గానగర్, దుర్గగుడి ఘాట్ రోడ్డు మీదుగా ఆలయానికి చేర్చారు. ఉరేగింపులో కోలాట బృందాల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
పురవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు