పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమం పనులు ఏడాదిన్నరలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్.. అధికారులను ఆదేశించారు. అలాగే ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లోనూ నాడు- నేడుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పనులకు నిధుల సమీకరణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నిధుల సమీకరణపై కచ్చితమైన ప్రణాళిక ఉండాలని సూచించారు. లక్ష్యం నిర్దేశించుకుని వేగంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎం ఆదేశాలు మరికొన్ని
- అక్టోబరు 1 నుంచి రాయలసీమ కరవు నివారణ పనులు ప్రారంభించాలి
- పోలవరం నుంచి అదనపు జలాల తరలింపు త్వరగా పూర్తి కావాలి
- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు త్వరగా పూర్తి కావాలి
- పల్నాడులో కరవు నివారణ, తాగునీటి కల్పన పనులు త్వరగా చేపట్టాలి
- కొల్లేరు ఉప్పునీటిమయం కాకుండా చేపట్టే పనులు త్వరగా పూర్తి కావాలి