ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయి'

రాష్ట్ర వ్యాప్తంగా మనబడి 'నాడు-నేడు' ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలకు నూతన జవసత్వాలు అందించాలనే ఉద్దేశంతో... నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా మనబడి నాడు-నేడు ప్రారంభ కార్యక్రమం

By

Published : Nov 14, 2019, 7:53 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా మనబడి నాడు-నేడు ప్రారంభ కార్యక్రమం

పశ్చిమ గోదావరి జిల్లాలో...
ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పశ్చిమగోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని పెనుగొండ మండలం సిద్ధాంతం ఉన్నత పాఠశాలలో మంత్రులు తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలన్నీ సకల సౌకర్యాలతో సుందరంగా రూపుదిద్దుకుంటాయని మంత్రులు చెప్పారు.

కడప జిల్లాలో..
కడప జిల్లాలోని నాడు-నేడు కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... ముందుచూపుతోనే పేదపిల్లల కోసం ఆలోచన చేశారని... ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని వివరించారు.

కృష్ణా జిల్లాలో...
కృష్ణా జిల్లా విజయవాడలోని కళాక్షేత్రంలో నగరపాలక సంస్థ నిర్వహించిన... బాలల దినోత్సవ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలకు నూతన జవసత్వాలు అందించాలనే ఉద్దేశంతో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో...
నెల్లూరు జిల్లా మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. రానున్న మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ విద్యాసంస్థల కన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాలో...
అనంతపురం జిల్లా హిందూపురంలోని ఎంజీఎం హైస్కూల్​లో నిర్వహించిన మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని... రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్​నారాయణ ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన మనబడి నాడు-నేడు పైలాన్​ను మంత్రి ఆవిష్కరించారు.

విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లాలోని ఉత్తరావల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో... నాడు-నేడు కార్యక్రమాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. త్వరలో... ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'నాడు-నేడు'తో పేదల తలరాత మారుస్తా'

ABOUT THE AUTHOR

...view details