కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు, కరోనా సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్న జర్నలిస్టులకు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్95 మాస్కులు పంపిణీ చేశారు. పురిటిగడ్డ ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు డా.వేములపల్లి సురేష్ సహకారంతో 50 వేల రూపాయల విలువైన ఆరోగ్య భద్రతా కిట్లను ఎస్పీ రవీంద్రనాధ్బాబు చేతుల మీదుగా అందజేశారు.
పోలీసులకు, జర్నలిస్టులకు ఎన్95 మాస్కులు అందజేత - n95 masks distributed to police and journalists in challapalli
కృష్ణా జిల్లా చల్లపల్లిలో పోలీసులకు, పాత్రికేయులకు ఎన్95 మాస్కులను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. పురిటిగడ్డ ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోలీసులకు, జర్నలిస్టులకు ఎన్95 మాస్కులు అందజేత