కరోనా వైరస్‌ను నివారించటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. మైలవరం లక్కిరెడ్డి హానిమిరెడ్డి పాఠశాలలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను సందర్శించారు. దుకాణదారులు, వినియోగదారులు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. వదంతులు నమ్మకుండా, ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని పిలుపునిచ్చారు. మైలవరం, ఇబ్రహీంపట్నం మెుదలైన చోట్ల క్వారంటైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ 5 వారాలకు పొడిగించవచ్చని అన్నారు. ప్రపంచానికి అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందనీ, ప్రజలు రహదారులపై గుంపులు గుంపులుగా ఉండకుండా, ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు.
రైతు బజార్‌ను సందర్శించిన మైలవరం ఎమ్మెల్యే - రైతుల బజార్లో మైలవరం ఎమ్మెల్యే
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను సందర్శించారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు పాటించి సహకరించాలని కోరారు.
రైతు బజార్‌ను సందర్శించిన మైలవరం ఎమ్మెల్యే