రైతులపై కపట ప్రేమ చూపుతూ అవాస్తవ ప్రచారాలు చేస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని వైకాపా నాయకులు ఎద్దేవా చేశారు. తెదేపా అధికారంలో ఉన్నప్పడు దేవినేనికి కనిపించని ధ్యానం ధరలు నేడు గుర్తుకు రావటం విడ్డూరంగా ఉందని మైలవరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పామర్తి శ్రీనివాసరావు అన్నారు.
'ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ని విమర్శించే అర్హత దేవినేని ఉమకు లేదు' - Mylavaram Market Committee Chairman Pamarthi Srinivasa Rao updates
మాజీ మంత్రి దేవినేని ఉమ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని వైకాపా నాయకులు ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పడు కనిపించని ధాన్యం ధరలు ఇప్పుడు గుర్తుకు రావటం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ని విమర్శించే అర్హత దేవినేని ఉమకు లేదన్నారు.
!['ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ని విమర్శించే అర్హత దేవినేని ఉమకు లేదు' Mylavaram Market Committee Chairman Pamarthi Srinivasa Rao press meet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12059055-151-12059055-1623146005610.jpg)
మైలవరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పామర్తి శ్రీనివాసరావు
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చొరవతో నేడు రైతులు 2 పంటలు పండిస్తుంటే ధాన్యం ధరలపై దేవినేని ఉమా హడావుడి చూసి రైతులు ముక్కున వేలు వేసుకుంటున్నారని వైకాపా నేత అప్పిడి సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ని విమర్శించే అర్హత... 10 ఏళ్లు పాలన చేసి రైతులకు మొండి చెయ్యి చూపిన దేవినేని ఉమాకి లేదన్నారు.
ఇదీ చదవండి:'నా భర్త చనిపోయాడు.. అత్త వెళ్లగొట్టింది.. నేనెలా బతకాలి?'