ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా క్వారంటైన్ పాటించాలని మైలవరం వైద్యారోగ్య సిబ్బంది స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఆయుర్వేద వైద్యులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు తమ కుటుంబాలతో స్థానికంగా ఉన్న రాజపేటకు ఈ నెల 23న వచ్చారు. విషయం తెలుసుకున్న ఏఎన్ఎమ్, వైద్య సిబ్బంది వారిని పరీక్షించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, బయటకు రాకుండా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బందిని సంప్రదించాలని చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు చేతులు శుభ్రపరచుకునే విధానానంపై వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు.
'ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్ పాటించాలి' - krishna district mailavaram
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా స్వీయ నిర్బంధంలో ఉండాలని మైలవరం వైద్య సిబ్బంది స్పష్టం చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిని ఆరోగ్య సిబ్బంది పరీక్షించి... క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
చంద్రాపూర్ నుంచి వచ్చిన రెండు కుటుంబాలకు మైలవరం వైద్యుల పరీక్షలు