కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కృష్ణాజిల్లా నందిగామలో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. లౌకిక రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకొచ్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని, అన్ని వర్గాలకు సమానత్వాన్ని అందజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన - పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వార్తలు
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా నందిగామలో ముస్లింలు నిరసన చేపట్టారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిరసన తెలుపుతున్న ముస్లింలు