కృష్ణా జిల్లా చందర్లపాడులోదారుణం జరిగింది. కట్టుకున్నవాడే...ఆమె పాలిట మృత్యువయ్యాడు. కొడవటి కల్లుకు చెందిన ప్రసాద్... రేషన్ డీలర్‌గా పని చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో తనకు పెట్టే ఆహారంలో భార్య మత్తు మందు కలిపి ఇస్తుందని... అందుకే మత్తుగా ఉంటుందనే అనుమానంతో గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. కోపంతో ఆమె గొంతు నులిమి బలంగా గోడకేసి కొట్టాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో భార్యను గొంతునులిమి చంపిన భర్త - Murder on suspicion of wife in krishana district
భార్యపై అనుమానంతో భర్త గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా చందర్లపాడులో జరిగింది.
భార్యపై అనుమానంతో గొంతునులిమి హత్య