విజయవాడలోని కొత్తపేటలో దారుణం జరిగింది. చనమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్పై జరిగిన హత్య కలకలం సృష్టించింది. రౌడీషీటర్ కిలారి సురేష్ అలియాస్ బుగ్గలోడు అనే వ్యక్తిని కత్తులతో దాడి చేసి చంపేశారు. ఆటోడ్రైవర్లతో వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడిపై గతంలో గంజాయికి సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
కత్తులతో నరికి రౌడీషీటర్ దారుణ హత్య - ap latest
విజయవాడలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి చంపారు.

కత్తులతో నరికి రౌడీషీటర్ దారుణ హత్య
రౌడీషీటర్ దారుణ హత్య