ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణహాని భయంతోనే చంపేశారు! - gudiwada

గుడివాడ ధనియాలపేటలో ఈనెల 16న అర్ధరాత్రి జరిగిన రౌడీషీటర్ భార్గవ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

హత్య

By

Published : Aug 20, 2019, 9:48 PM IST

ధనియాలపేట హత్యకేసును ఛేదించిన పోలీసులు

కృష్ణా జిల్లా గుడివాడలో ధనియాలపేట కాలనీలో జరిగిన రౌడీ షీటర్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 16న అర్ధరాత్రి రౌడీ షీటర్ భార్గవ్​ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. కేసును విస్తృతంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మెకానిక్​లుగా పనిచేసే శ్రీనివాసు, చంద్రశేఖర్​కు.. హత్య జరిగిన రోజు భార్గవ్​తో వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు.. భార్గవ్​తో ప్రాణహాని ఉంటుందని భయపడి.. హత్య చేశారని గుర్తించినట్టు గుడివాడ డీఎస్పీ సత్యానందం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details