కాపురానికి వెళ్లకుండా వేరే వ్యక్తితో ఉంటానని చెప్పడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు.. రత్నకుమారి అనే మహిళను హత్య చేశారు. ఈ నెల 17న కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో జరిగిన ఈ హత్యకేసును పోలీసులు ఛేదించారు. కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటున్న ఆమెను కుటుంబ సభ్యులు కాపురానికి వెళ్లమని ఒత్తిడి చేయగా.. ఆమె అందుకు ఒప్పుకోలేదు. వేరే వ్యక్తితో ఉంటానని చెప్పింది. దీంతో ఆగ్రహించిన వారు.. రత్నకుమారిని గొంతునులిమి చంపేశారు.
మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్.. కాపురానికి వెళ్లనందుకే! - కృష్ణా జిల్లా వార్తలు
కృష్ణా జిల్లాలో ఈనెల 17న జరిగిన మహిళ హత్య కేసును చందర్లపాడు పోలీసులు ఛేదించారు. కాపురానికి వెళ్లకుండా.. వేరే వ్యక్తితో ఉంటానని చెప్పడంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆమెను హత్య చేశారని పోలీసులు తెలిపారు. వారిని ఇవాళ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు.
murder accused arrest in yeturu krishna district
మృతురాలి తల్లి, అక్క, అక్క కుమారుడు కలిసి హత్య చేసినట్లు అంగీకరించారని నందిగామ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి వెల్లడించారు. ఇవాళ వారిని న్యాయస్థానం ఎదుట హాజరు పరచనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:యూట్యూబ్లో చూసి.. నేరాలు నేర్చుకుంటున్నారు!