ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద తాకిడికి పైప్ లైన్లు ధ్వంసం..13 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా - మున్నేరు వరదలు

కృష్ణా జిల్లా వత్సవాయి మండల పరిధిలోని మున్నేరుకు నాలుగు రోజులపాటు వరద కొనసాగింది. వరద ప్రవాహానికి లింగాల వంతెనపై తాగునీటి పైపులైన్లు ధ్వంసమయ్యాయి. చిల్లకల్లు, లింగాల, వత్సవాయి తాగునీటి పథకాల పైప్ లైన్లు వరద తీవ్రతకు కొట్టుకుపోయాయి. దీంతో 13 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

వరద తాకిడికి పైప్ లైన్లు ధ్వంసం.. 13 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా
వరద తాకిడికి పైప్ లైన్లు ధ్వంసం.. 13 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా

By

Published : Aug 19, 2020, 10:38 PM IST

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. 14వ తేదీన మొదలైన వరద ఏకధాటిగా నాలుగు రోజులు కొనసాగింది. దశాబ్ద కాలం తర్వాత మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. నదిలో రెండు రోజులపాటు రోజుకి 1.16 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. వరద ఉద్ధృతికి కృష్ణా జిల్లా లింగాల వద్ద వంతెనపై ఉన్న తాగునీటి పథకాల పైపులైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ కారణంగా గడచిన నాలుగు రోజులుగా 13 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. బుధవారం వరద తగ్గుముఖం పట్టడంతో ఆర్​డబ్ల్యూఎస్ అధికారులు ధ్వంసమైన పైపులైన్లు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ మరమ్మతులు చేపడతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details