ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాకు తక్షణమే జీతాలు పెంచండి.. ఉద్యోగాలు పర్మినెంట్ చేయండి' - పారిశుద్ధ్య కార్మికుల సమ్మె వార్తలు

నందిగామ నగర పంచాయతీ ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు సమ్మె చేపట్టారు. జీతాలు పెంచాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

Municipal workers strike
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

By

Published : Jun 14, 2021, 11:48 AM IST

నందిగామ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, ఒప్పంద కార్మికులు... తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేపట్టారు. విధులు బహిష్కరించిన కార్మికులు... కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

తమ జీతాలు పెంచాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, రూ.50 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. సీఐటీయూ జిల్లా నాయకుడు సైదులు, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details