మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని చెప్పి జీవో జారీ చేసి సంవత్సరం గడిచినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని సీపీఎం కన్వీనర్ బాబురావు విజయవాడలో అన్నారు. ఆగస్టు 4వ తేదీన సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టనున్న మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెకు ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య మద్దతు పలుకుతుందన్నారు. వివిధ మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, వేతన బకాయిలు చెల్లించాలని, ఆరోగ్య బీమా ఇతర రక్షణ కల్పించాలని తదితర కోర్కెల పరిష్కారానికై సమ్మె బాట పట్టనున్నారన్నారు.
రేపటి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె బాట - ఏపీవో మునిసిపాలిటి కార్మికుల సమస్యలు
రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్, తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, వేతన బకాయిలు చెల్లించాలని, ఆరోగ్య బీమా ఇతర రక్షణ కల్పించాలని తదితర సమస్యల పరిష్కారానికై ఈ నెల 4న మున్సిపల్ కార్మికుల సమ్మె బాట పట్టనున్నారు.
ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. వారికి అభినందనలతో సరిపెట్టకుండా వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. అదనపు కార్మికులను నియమించి కార్మికుల మీద పనిభారం తగ్గించడానికి, అదేవిధంగా పట్టణ ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం పూనుకోవాలన్నారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి పని చేసిన కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించాలి. వారి న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి