ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి: కార్మికులు - విజయవాడవో బ్లాక్ డే

మోదీ ప్రభుత్వం రైతు, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు విజయవాడలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు.

విజయవాడలో మున్సిపల్ కార్మికులు ఆందోళన
విజయవాడలో మున్సిపల్ కార్మికులు ఆందోళన

By

Published : May 26, 2021, 5:33 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు విజయవాడలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. మోదీ ప్రభుత్వం.. రైతు, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఆరు నెలలుగా రైతులు దిల్లీలో ధర్నా చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించపోవడం బాధాకరమన్నారు.

వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని.. కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వాళ్లను ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details