కృష్ణాజిల్లా విజయవాడ మండలం పాతపాడులో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి ముందే పంచాయతీ కాంట్రాక్టు సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ రూరల్ మండలం సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. జీతాలు చెల్లించి తమను ఆదుకోవాలని.. లేకుంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయం ఏర్పాటు మంచిదే అయినప్పటికీ జీతాల చెల్లింపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఐటీయు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకపోతే..ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
జీతాలు చెల్లించాలని పాతపాడులో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - కృష్ణా జిల్లా విజయవాడ మండలం పాతపాడు
తమకు జీతాలు ఇవ్వాలంటూ పారిశుద్ధ్య కార్మికులు పాతపాడులో ఆందోళన నిర్వహించారు. గ్రామ సచివాలయం ఏర్పాటు మంచిదే అయినప్పటికీ తమకు జీతాలు చెల్లించకపోవడం బాధగా ఉందన్నారు.

workwrs are protest at beside of village secretariate
జీతాలు చెల్లించాలని పాతపాడులో పారిశుద్ధ్యకార్మికుల ధర్నా..