కృష్ణా జిల్లా గుడివాడలో పురపాలక సంఘం పరిధిలోని దుకాణాలకు అధికారులు వేలం నిర్వహించారు. 48 షాపులకు 20 ఏళ్ల లీజు గడువు తీరడం వల్ల మున్సిపల్ సంఘం సమక్షంలో వేలం నిర్వహించారు. వీటిలో 60 శాతం దుకాణాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించామని పురపాలక సంఘం కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు.
గుడివాడలో ప్రభుత్వ దుకాణాలకు వేలం - గుడివాడ తాజా వార్తలు
కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం పరిధిలోని ప్రభుత్వ దుకాణాలకు అధికారులు వేలం నిర్వహించారు. వీటిలో 60 శాతం దుకాణాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించారు.
లాటరీ పద్ధతిలో వేళం నిర్వహిస్తున్న గుడివాడ పురపాలక శాఖ అధికారులు