నూజివీడు పురపాలికలో 151 మంది నామినేషన్లు దాఖలు చేయగా.... వీరిలో 78 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తెలిపారు.. పట్టణంలోని 32 వార్డులలో రెండు వార్డుల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులకు గాను 55 మంది బరిలో నిలిచారు. పెడన మున్సిపల్ ఎన్నికల్లో 23 వార్డుల పరిధిలోని 47 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తిరువూరు పురపాలికలో ఆఖరి నిమిషంలో హైడ్రామా నడిచింది. సమయం ముగిసిన తర్వాత వైకాపా నాయకులు భాజపా అభ్యర్థితో బలవంతంగా నామినేషన్ ఉపసంహరణకు తీసుకెళ్లారు. పోలీసులే దగ్గరుండి మున్సిపల్ కార్యాలయంలో భాజపా అభ్యర్థిని పంపించారని తెదేపా నాయకులు ఆరోపించారు.
తిరువూరు మున్సిపాలిటీలో హైడ్రామా - Municipal elections in Noojeedu
పురపాలిక ఎన్నికల్లో మరో ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తైంది. నగర, పురపాలికల్లోని ...డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. నూజివీడులో 151 మంది నామినేషన్లు దాఖలు చేయగా 78 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తెలిపారు.తిరువూరు పురపాలికలో ఆఖరి నిమిషంలో ఆఖరి నిమిషంలో హైడ్రామా నడిచింది. సమయం ముగిసిన తర్వాత వైకాపా నాయకులు భాజపా అభ్యర్థితో బలవంతంగా నామినేషన్ ఉపసంహరణకు తీసుకెళ్లారు
నూజివీడు పురపాలిక బరిలో నిలిచిన 73 మంది