పురపోరుకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 29 పురపాలికలు ప్రస్తుత ఎన్నికలకు దూరమయ్యాయి. 3 కార్పొరేషన్లలోనూ ఎన్నికల కోలాహం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కోర్టు కేసులు,ఇతర కారణాల వల్లే ఇక్కడ ఎన్నికలు నిర్వహించట్లేదని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.
12 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు
రాష్ట్రవ్యాప్తంగా 12 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయని, కొన్ని వివాదాల వల్లే శ్రీకాకుళం, నెల్లూరు, రాజమహేంద్రవరంలో ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తెలిపారు. పురపాలక, నగరపాలక సంస్థలకు ఆయన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.
రాష్ట్రంలో నాలుగింట మూడువంతుల పురపాలికల్లోనే ఎన్నికల సందడి ఉండబోతోంది. రిజర్వేషన్లు ఖరారైన మొత్తం 104 పురపాలిక, నగర పంచాయతీల్లో 75చోట్ల మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రకటించారు. నగర, పురపాలక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆయన వెల్లడించారు. 75 పురపాలికలు, నగర పంచాయతీల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎన్నికల్లో వాయిదా వేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 15 కార్పొరేషన్లలో 3 కార్పొరేషన్లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కోర్టు కేసుల వల్ల నెల్లూరు, శ్రీకాకుళం, రాజమహేంద్రవరంలో ఎన్నికలు వాయిదా వేసినట్లు ఎస్ఈసీ తెలిపారు. ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 16 వరకు గడువు ఇచ్చారు. ఈనెల 23న ఎన్నికలు...27వ తేదీన కౌంటింగ్ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరించారు.