ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురపోరు: బెజవాడలో జోరందుకున్న ప్రచారం - AP Municipal Elections

నగర, పురపాలక ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులెవరో తేలడంతో రాజకీయ పార్టీలు ప్రచారం స్పీడ్​ పెంచాయి. వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ... తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.

పురపోరు: బెజవాడలో జోరందుకున్న ప్రచారం
పురపోరు: బెజవాడలో జోరందుకున్న ప్రచారం

By

Published : Mar 4, 2021, 9:37 PM IST

పురపోరు: బెజవాడలో జోరందుకున్న ప్రచారం

పురపోరుకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్న ప్రచారం ఇక జోరందుకుంది. మేయర్‌, ఛైర్‌పర్సన్‌ పీఠాలపై ఆశావహులు దృష్టి సారించారు. ఆశావహుల వైపు అభ్యర్థులు చూపు సారించారు. ప్రచార ఖర్చుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే తరుణంలో ప్రచారాల జోరు ఊపందుకుంది. విజయవాడ 15వ డివిజన్​లో వైకాపా అభ్యర్థి బెల్లం దుర్గ తరఫున ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ స్థానంలో అంతర్గత ఒప్పందంలో భాగంగా తెదేపా తమ అభ్యర్థితో నామినేషన్ ఉపసంహరింపజేసి జనసేనకు మద్దతు పలుకుతోంది.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ వైకాపా అభ్యర్థి చైతన్య రెడ్డికి మద్దతుగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 61వ డివిజన్ శాంతినగర్, మసీదు సెంటర్ పరిసర ప్రాంతాలలో వైకాపా అభ్యర్థిని ఉమ్మడి రమాదేవి విజయాన్ని కాంక్షిస్తూ... ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రచారం నిర్వహించారు. పశ్చిమనియోజకవర్గంలోని 47వ డివిజన్​లో వైకాపా అభ్యర్థి గోదావరి గంగతో కలసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

పశ్చిమ నియోజకవర్గం 50 డివిజన్ తెదేపా అభ్యర్థి కుప్పల గంగాధర్ తరఫున మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, అధికార ప్రతినిధి నాగుల్​మీరా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 16వ డివిజన్​లో రత్నం రజిని తరఫున ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 23వ డివిజన్​లో ఎంపీ కేశినేని... అభ్యర్థి ఎన్.బాల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 16వ డివిజన్​లో కాంగ్రెస్ అభ్యర్థి అప్పల నారాయణ, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండీ... నేను అభివృద్ధి చేస్తే.. జగన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details