ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా: కేశినేని శ్వేత - తెదేపా అభ్యర్థి కేసినేని స్వేత కామెంట్స్

కృష్ణా జిల్లాలో పుర ఎన్నికల ప్రచార హోరు జోరందుకుంది. విజయవాడ 11వ డివిజన్​లో తెదేపా అభ్యర్థిగా కేశినేని శ్వేత ఎన్నికల బరిలో ఉన్నారు. స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు.

municipal elections campaign
ప్రజల్లోకి అభ్యర్థులు

By

Published : Mar 1, 2021, 6:58 PM IST

విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు. విజయవాడ 11వ డివిజన్​లో తెదేపా అభ్యర్థి కేశినేని శ్వేత వీధి వీధి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెదేపా చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేయమని ఓట్లు అడుగుతున్నారు. ఏడాదిన్నర కాలంలో వైకాపా ప్రభుత్వం విజయవాడ నగరానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం పేదలకు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటోందని.. అవి స్కీమ్​లు కావని స్కామ్​లని విమర్శించారు. విజయవాడ వైభవాన్ని పునర్​ నిర్మిస్తామని కేశినేని శ్వేత చెప్పారు. నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా, మిత్ర పక్షం సీపీఐ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details