MukhaChitram Movie Team Sandadi:విజయవాడ నగరంలో 'ముఖచిత్రం' సినిమా యూనిట్ సందడి చేసింది. ఓ ప్రముఖ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో 'ముఖచిత్రం' సినిమా యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సందీప్ మాట్లాడుతూ కలర్ ఫోటో చిత్రం తరహాలో విభిన్న కథాంశంతో నిర్మించిన ముఖచిత్రం డిసెంబర్ 9వ తేదీన ప్రేక్షకులకు ముందుకు వస్తుందన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కలర్ ఫొటో సినిమాతో జాతీయ అవార్డు పొందడం సంతోషంగా ఉందని, ఈ సినిమాతో నిర్మాతగా మీ ముందుకు రావడం మరింత ఆనందంగా ఉందని అన్నారు. సినిమా హీరోయిన్ ప్రియ వడ్లమాని మాట్లాడుతూ విజయవాడతో తనకి ఎంతో అనుబంధం ఉందని, విజయవాడ ప్రేక్షకులకు సినిమా అంటే బాగా ఇష్టపడతారని అన్నారు. తమ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్నారు. ఈ చిత్రానికి గంగాధర్ దర్శకత్వం వహించగా, వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, సునీల్ తదితరులు నటించారు.
విజయవాడలో సందడి చేసిన చేసిన 'ముఖచిత్రం' యూనిట్ - Producer Sandeep
MukhaChitram Movie Team Sandadi: విజయవాడ నగరంలో 'ముఖచిత్రం' సినిమా యూనిట్ సందడి చేసింది. ఓ ప్రముఖ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖచిత్రం సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
MukhaChitram Movie