ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలంటూ విజయవాడ కృష్ణలంక కోదండరామస్వామి ఆలయంలో మృత్యంజయ హోమం నిర్వహించారు. భగవంతుడు బాలసుబ్రహ్మణ్యానికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆలయ భక్త బృందం ప్రార్ధించింది. ఆలయ అర్చకులు పక్కి శ్రీనివాసశర్మ నేతృత్వంలో హోమం చేశారు.
ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ మృత్యుంజయ హోమం - ఎస్పీబీ కోలుకోవాలని కృష్ణలంకలో మృత్యుంజయ హోమం
తన పాటలతో కోట్లాది మంది హృదయాలను దోచుకున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... కరోనా నుంచి కోలుకోవాలని విజయవాడలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. కృష్ణలంక కోదండరామస్వామి ఆలయంలో ఈ హోమం చేశారు.
ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని కృష్ణలంకలో మృత్యుంజయ హోమం