నన్నపనేని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: ఎమ్మార్పీఎస్ - women's commission former chairperson
మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, మహిళా ఎస్ఐ పై దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ.... ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో వద్ద ధర్నా నిర్వహించారు. దళితులను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
'నన్నపనేని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: ఎమ్మార్పీఎస్'
చలో ఆత్మకూరు కార్యక్రమంలో భాగంగా మహిళా ఎస్ఐ పై నన్నపనేని రాజకుమారి దురుసుగా ప్రవర్తించారంటూ విజయవాడలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తక్షణమే రాజకుమారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సాటి మహిళపై రాజకుమారి కులం పేరుతో దూషణకు దిగారని, ఇది ముమ్మాటికీ దళితులను కించపరడమే అంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు సురేష్ అన్నారు.