పరిషత్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న జనసేన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... విచారణ నేటికి వాయిదా వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలంటూ ఎస్‌ఈసీని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
ఎన్నికలు జరపాలా వద్దా అనేది పూర్తిగా ఎస్‌ఈసీ పరిధిలోని అంశమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రధాన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.