ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా నాయకులు బెదిరించి నామినేషన్​ విత్​డ్రా చేయించారు' - unguturu latest news

ఎంపీటీసీగా నామినేషన్​గా దాఖలు చేసిన తనను వైకాపా నాయకులు బెదిరించి విత్​డ్రా చేయించారని గంటా పార్వతి అనే అభ్యర్థి ఆరోపించింది. వైకాపా నేతల నుంచి ప్రాణహాని ఉందని కలెక్టర్ ఇంతియాజ్​ను కలిసి విన్నవించుకుంది.

nnnn
'వైకాపా నాయకులు బెదిరించి నామినేషన్​ విత్​డ్రా చేయించారు'

By

Published : Feb 20, 2021, 6:07 PM IST

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో తెదేపా తరపున ఎంపీటీసీగా గంటా పార్వతి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక వైకాపా నేతలు తనను భయాందోళనకు గురి చేసి బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఆమె ఆరోపించారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని కలెక్టర్ ఇంతియాజ్​ను కలిసి వివరించారు. వైకాపా నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆమె కలెక్టర్​కు తెలిపారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details