ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

9వ రోజు ధర్నా ... సీఎం స్పందన సున్నా - krishna

'జగనన్నా... గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకు మమ్మల్ని తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించన్నా' అంటూ ఎంపీఈఓలు 9వ రోజూ ధర్నా కొనసాగిస్తున్నారు.

ఎంపీఈఓల 9వ రోజు ధర్నా

By

Published : Jul 25, 2019, 7:14 PM IST

ఎంపీఈఓల 9వ రోజు ధర్నా

రాష్ట్రంలోని అన్ని మండలాలకు చెందిన దాదాపు రెండు వేల మంది వ్యవసాయ శాఖ ఎంపీఈఓలు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద 9వ రోజూ ధర్నా నిర్వహించారు. తాము ఐదేళ్లుగా రైతులకు ఎన్నో సేవలు చేస్తున్నామని, ఇప్పటికిప్పుడు తమ ఉద్యోగాలను తొలగిస్తే కుటుంబాల పరిస్థితులు ఏంటని ఆవేదన చెందారు. తామంతా ఈ ఉద్యోగం మీదనే ఆధారపడి ఉన్నామన్నారు. తొమ్మిది రోజులుగా తమ కుటుంబాలను వదులుకొని నిరసన చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 'జగనన్నా... గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకు మమ్మల్ని తీసుకుని భద్రత కల్పించన్నా' అంటూ వేడుకున్నారు. ఉద్యానవనశాఖ, మత్స్య శాఖ, మరియు పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details