ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బౌద్ధ భిక్షువుల శిక్షణాలయాన్ని సందర్శించిన ఎంపీ శ్రీధర్​ - బౌద్ధ భిక్షువుల శిక్షణాలయాన్ని ఏలూరు ఎంపీ కోటగిరి

కృష్ణా జిల్లా చెక్కపల్లి గ్రామంలో గల బౌద్ధ భిక్షువుల శిక్షణాలయాన్ని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్​ సందర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యంగా ఉండే పరిపాలన ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు.

బౌద్ధ భిక్షువుల శిక్షణాలయాన్ని సందర్శించిన ఏలూరు ఎంపీ శ్రీధర్​

By

Published : Oct 7, 2019, 11:51 PM IST

బౌద్ధ భిక్షువుల శిక్షణాలయాన్ని సందర్శించిన ఏలూరు ఎంపీ శ్రీధర్​

అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలను పొందిన ఘనత వైఎస్ జగన్మోహన్​డ్డికి మాత్రమే దక్కుతుందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో గల బౌద్ధ భిక్షువుల శిక్షణాలయాన్ని ఆయన సందర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందేలా జగన్ పాలన కొనసాగుతుందని శ్రీధర్​ అన్నారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు. భారతావనిలో ఇక్కడే బౌద్ధ భిక్షువులకు శిక్షణాలయం ఏర్పాటు కావడం... ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగించడం ఆనందంగా ఉందని తెలిపారు. ధర్మానికి కట్టుబడి ఉండాలని బౌద్ధ భిక్షువులు సూచించారు. ధర్మమును సోదాహరణంగా విశ్లేషించారు. కార్యక్రమంలో నిర్వహకులు జంపన సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details