ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హామీలన్నీ నెరవేర్చా.. హేట్రిక్ సాధిస్తా! - కొనకళ్ల నారాయణరావు

“2014 ఎన్నికలకు ముందు నాలుగు హామీలు ఇచ్చాను. అందులో ప్రధానమైంది మచిలీపట్నం పోర్టు. అన్ని పనులూ నేడు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఎంపీ నిధులనూ అన్ని వర్గాల వారికి సమానంగా అందించా. హాట్రిక్ సాధిస్తానన్న నమ్మకం ఉంది.” - కొనకళ్ల నారాయణరావు

ప్రగతి నివేదన విడుదల: మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ

By

Published : Apr 4, 2019, 1:17 PM IST

ప్రగతి నివేదన విడుదల: మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ
మచిలీపట్నం ఎంపీగా... తాను చేసిన అభివృద్ధిపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. మచిలీపట్నం నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన.. హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పారు. మచిలీపట్నం వాసుల దశాబ్దాల కలగా ఉన్న ఓడరేవు నిర్మాణం ప్రారంభించానన్నారు. మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారి పూర్తి చేయడం సహా మచిలీపట్నం తీర ప్రాంతాన్ని కలుపుతూ నిర్మిస్తోన్న 216 జాతీయ రహదారి నిర్మాణాన్ని పరుగులు పెట్టించామని చెప్పారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనుల నివేదకను ప్రజలకు వివరించారు. తెదేపానే గెలిపించాలని కోరారు.

కొనకళ్ల ప్రగతి నివేదిక:

  • దశాబ్దాల కలగా ఉన్న బందర్ పోర్టు నిర్మాణం ప్రారంభం

  • రూ.7, 500 కోట్లతో తొలిదశ పోర్టు నిర్మాణం

  • మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి నిర్మాణం

  • రూ. 764 కోట్లతో మచిలీపట్నం - విజయవాడ జాతీయ హైవే పనులు

  • కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు జాతీయ రహదారి

  • రూ. 2 వేల కోట్లతో కత్తిపూడి - ఒంగోలు హైవే టెండర్లు

రూ. 650 కోట్లతో సాగుతోన్న రైల్వే లైన్ డబ్లింగ్ పనులు

  • మచిలీపట్నం నుంచి విజయవాడకు రైల్వే లైన్ డబుల్ ట్రాక్ నిర్మాణం

  • చెన్నపట్నం - ముంబైని మించి మచిలీపట్నం పోర్టు నిర్మించడమే లక్ష్యం

  • ఎంపీ నిధులతో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు

  • గ్రామాలకు రహదారులు, మౌలికవసతుల కల్పనకు పెద్దపీట

  • బందరులో లడ్డూలు పంచుకునేది మేమే: కొల్లు రవీంద్ర


    ABOUT THE AUTHOR

    ...view details