ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలకలం రేపిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు..! కాంగ్రెస్, కేసీఆర్ దోస్తీ తప్పదన్న ఎంపీ - అసెంబ్లీ ఎన్నికలపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

komati reddy : వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. మరో వైపు హాథ్‌ సే హాథ్‌ సే జోడో యాత్రలో భాగంగా భద్రాద్రి జిల్లాలో ప్రర్యటిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవినైనా ఇవ్వగలరా అని ప్రశ్నించారు.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

By

Published : Feb 14, 2023, 4:13 PM IST

komatireddy venkatreddy sensational comments : రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో అందరం కష్టపడితే 40-50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి తెలిపారు.

'కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం మాత్రం ఖాయం. పార్టీలోని ఏ ఒక్కరితో కాంగ్రెస్‌కు అన్ని సీట్లు కూడా రావు. నేను గెలిపిస్తా అంటే.. మిగిలినవారు ఇంట్లోనే ఉంటారు. నేను స్టార్‌ క్యాంపెయినర్‌ను.. ఒక్క జిల్లాలోనే ఎందుకు తిరుగుతా? మార్చి మొదటి వారం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తాను. పాదయాత్ర ఒక్కటే కాదు... బైకుపై కూడా పర్యటిస్తా. పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై పార్టీ అనుమతి తీసుకుంటాను' అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

పార్టీ అధ్యక్ష పదవినైనా దళితుడికి ఇవ్వగలరా.. హాథ్‌ సే హాథ్‌ సే జోడో యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పర్యటించారు. పాదయాత్రలో ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాత్రి మణుగూరు అంబేడ్కర్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. దళితున్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్​ పార్టీ అధ్యక్ష పదవినైనా దళితుడికి కట్టబెట్టగలరా? అని రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details