ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరకాల స్వప్నం.. సాకారమవుతోంది: ఎంపీ కేశినేని - kesineni nani on durgamma fly over works

విజయవాడ దుర్గమ్మ పైవంతెన పనులు ఎంపీ కేశినేని నాని పరిశీలించారు. వచ్చేనెల 4న వంతెనను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నితిన్ గడ్కరీ ఈ వంతెనను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

mp kesineni nani observes durgamma fly over works
దుర్గమ్మ పైవంతెన పనులు పరిశీలించిన ఎంపీ కేశినేని నాని

By

Published : Aug 24, 2020, 2:12 PM IST

దుర్గమ్మ పైవంతెన పనులు పరిశీలించిన ఎంపీ కేశినేని నాని

అసాధ్యమని నిరుత్సాహపరిచిన దశ నుంచి పోరాడి సుసాధ్యం చేయడం ద్వారా... విజయవాడ వాసుల చిరకాల స్వప్నమైన కనకదుర్గ పైవంతెన సాకారం కాబోతోందని ఎంపీ కేశినేని నాని అన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ వంతెన పనులను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారి ఎస్‌.కె.సింగ్‌, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని కేశినేని నాని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సహకారంతో ఆరు లైన్ల పైవంతెన నిర్మాణం జరిగిందన్నారు. విజయవాడ వాసులు నితిన్‌ గడ్కరీకి రుణ పడి ఉంటారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details