ముస్లిం సమాజం పట్ల జగన్ అనుకూలంగా ఉండి ఉంటే ..ఎన్‌ఆర్‌సీపై కేంద్రం తెచ్చిన బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేవారు కాదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎన్‌ఆర్‌సీ బిల్లును పార్లమెంటులో తెదేపా వ్యతిరేకించిందన్న ఆయన... విజయవాడ పరిధిలో బిల్లును అమలు కానివ్వమని స్పష్టం చేశారు. ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఎంపీ కేశినేని నాని పాల్గొని.. 2వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే అమరావతిని అన్యాయంగా నిలిపివేశారని విమర్శించారు.
అమరావతిని అన్యాయంగా ఆపేశారు: ఎంపీ కేశినేని నాని - mp kesineni nani updates
విజయవాడలో ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సభలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఓట్ల కోసం తాను పని చేయనని.. సమాజం మంచి కోసమే పని చేస్తానని అన్నారు.
ఎంపీ కేశినేని నాని
జగన్ వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. ఓట్ల కోసం తాను పని చేయననీ, సమాజం మంచి కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. ఎంపీ అయ్యాక, కాకముందు తన ప్రవర్తన అందరికీ తెలుసన్నారు. ముస్లింలకు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను జగన్ రద్దు చేశారని కేశినేని నాని ఆరోపించారు.
ఇదీ చదవండి:విజయవాడ తెదేపాలో భగ్గుమన్న విభేదాలు